Header Banner

రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ! మే 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

  Sun Apr 06, 2025 10:15        Others

రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు మే 1 నుంచి ఛార్జీల పెంపుతో శాక్ కలిగించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం, క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజులు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఛార్జీలు దేశీయ, అంతర్జాతీయ రెండు రకాల ట్రాన్సాక్షన్లకు వర్తించనున్నాయి. ఇంటర్‌చేంజ్ ఫీజు అనేది ట్రాన్సాక్షన్ సమయంలో మర్చెంట్ బ్యాంకు, కార్డు ఇచ్చే బ్యాంకు మధ్య ఉండే చెల్లింపు రుసుము. ఇది నేరుగా వినియోగదారుడిని ప్రభావితం చేయదు గానీ, వ్యాపారులు ఈ అదనపు ఖర్చును పరోక్షంగా వినియోగదారులపై మోపే అవకాశముంది. ప్రస్తుతం యుటిలిటీ సేవలకు 1%, ఈ-కామర్స్, ట్రావెల్ ట్రాన్సాక్షన్లకు 1.7%–1.8% ఫీజులు ఉన్నా, కొత్త రేట్లతో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి: కొలికపూడి పదవికి డేంజర్ బెల్స్.. సీఎం చంద్రబాబు షాక్ ట్రీట్‌మెంట్‌! కొత్త నాయకత్వానికి సంకేతాలా?

 

కొత్తగా అమలులోకి వచ్చే ఛార్జీలు కార్డు రకాన్నిబట్టి మారుతూ ఉంటాయి.ఉదాహరణకు, క్లాసిక్ రూపే క్రెడిట్ కార్డు ద్వారా POS లావాదేవీలకు 1.10%, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు 1.60% వసూలు చేస్తారు. ప్లాటినం కార్డులకు యుటిలిటీ వ్యాపారాల్లో 1.85%, సెలెక్ట్ కార్డులకు 2.02% వసూలు చేయనున్నారు. అంతేకాక, అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా ఛార్జీలు భారీగా పెరిగాయి. ATM విత్‌డ్రాల్స్‌కు 1.10 డాలర్లు, POS ట్రాన్సాక్షన్లకు క్లాసిక్ కార్డులకు 1.20%, ప్లాటినం, సెలెక్ట్ కార్డులకు 1.80%–2% వరకు ఫీజులు ఉండనున్నాయి. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఇంతకు ముందు యూపీఐ ద్వారా రూ. 2,000 లోపు లావాదేవీలకు ఛార్జీల మినహాయింపు ఉండగా, ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన కేటగిరీలకు మాత్రమే 0.70% ఛార్జీలతో రాయితీలు ఇవ్వనున్నారు. దీంతో వినియోగదారులపై ఖర్చు భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #RuPayCreditCard #CreditCardCharges #ChargeHike #DigitalPayments #NPCIUpdate #InterchangeFee #HiddenCosts